నెల్లూరు 09.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️
ఆత్మకూరు బస్టాండ్ వద్ద గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల బస్సు రైల్వే పోల్ ను ఢీ కొంది.శనివారం తెల్లవారుజామున 5:30గం.ల సమయంలో కళాశాల బస్సుకు బ్రేకులు పడనందున ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బస్సు పోల్ ను ఢీ కొనడంతో బస్సు ముందు వెళ్తున్న ఆటోకి ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. పోల్ లేనట్లయితే ఘోర ప్రమాదం జరిగేదన్నారు.కాగా బస్సు డ్రైవర్ పరారీ ఉన్నాడు.