Saturday, 16 May 2026
  • Home  
  • డెంగ్యూ నివారణకు ప్రజలందరి సహకారం అవసరం-డాక్టర్ బాలు
- తిరుపతి

డెంగ్యూ నివారణకు ప్రజలందరి సహకారం అవసరం-డాక్టర్ బాలు

శ్రీ కాళహస్తి, మే 16 (పున్నమి న్యూస్): జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ బాలు మాట్లాడుతూ డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే ప్రమాదకర వ్యాధి అని, పరిశుభ్రత పాటించడం ద్వారానే దీనిని సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పాత టైర్లు, కూలర్లు, కొబ్బరి చిప్పలు, నీటి పాత్రల్లో దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు. పూర్తి చేతుల దుస్తులు ధరించడం, దోమతెరలు వినియోగించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.