ట్రాన్స్ఫార్మర్ చోరీల ముఠా అరెస్ట్ – 19 కేసులు ఛేదించిన పోలీసులు
ఆత్మకూరు, మే 30: జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేర ముఠాను పోలీసులు అరెస్టు చేసి కీలక పురోగతి సాధించారు. ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, సంగం, చేజర్ల, రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొత్తం 19 చోరీ కేసులను ఛేదించారు. ఈ కేసుల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.2.31 లక్షల విలువైన రాగి, అల్యూమినియం వైండింగ్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఆస్తి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. కేసును విజయవంతంగా ఛేదించిన ఆత్మకూరు సబ్ డివిజన్‌తో పాటు సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.

ట్రాన్స్ఫార్మర్ చోరీల ముఠా అరెస్ట్ – 19 కేసులు ఛేదించిన పోలీసులు
ట్రాన్స్ఫార్మర్ చోరీల ముఠా అరెస్ట్ – 19 కేసులు ఛేదించిన పోలీసులు ఆత్మకూరు, మే 30: జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేర ముఠాను పోలీసులు అరెస్టు చేసి కీలక పురోగతి సాధించారు. ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, సంగం, చేజర్ల, రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొత్తం 19 చోరీ కేసులను ఛేదించారు. ఈ కేసుల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.2.31 లక్షల విలువైన రాగి, అల్యూమినియం వైండింగ్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఆస్తి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. కేసును విజయవంతంగా ఛేదించిన ఆత్మకూరు సబ్ డివిజన్‌తో పాటు సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.

