రైల్వేకోడూరు: రాఘవరాజపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని, దేశ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రైల్వేకోడూరు: రాఘవరాజపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని, దేశ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

