Tuesday, 15 September 2026
  • Home  
  • T M J F మూడవ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ
- రాజన్న సిరిసిల్ల

T M J F మూడవ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

టీఎంజేఎఫ్ రాష్ట్ర మూడవ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 11 (పున్నమి ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం (టీఎంజేఎఫ్) రాష్ట్ర మూడవ మహాసభల కరపత్రాలను గురువారం రాష్ట్ర నాయకులు సర్వాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. టీఎంజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ అధ్యక్షతన సెప్టెంబర్ 12న శనివారం హైదరాబాద్ కోఠిలోని బీసీసీఈ భవన్‌లో రాష్ట్ర మూడవ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీఎంజేఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తాత్కాలిక కమిటీని ప్రకటించారు. జిల్లా ఇన్‌చార్జిగా జింక శ్రీధర్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా కొల్లూరి సంతోష్, వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పెంట రామకృష్ణలను నియమించారు. జిల్లా ఇన్‌చార్జి జింక శ్రీధర్ మాట్లాడుతూ.. సమాజానికి సమాచారాన్ని చేరవేయడంలో మాదిగ సామాజిక వర్గం కీలక పాత్ర పోషించిందన్నారు. మాదిగ జర్నలిస్టుల భద్రత, హక్కులు, సంక్షేమం, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం టీఎంజేఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మాదిగ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన ఇబ్బందులు, సామాజిక వివక్ష తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మహాసభలు కీలక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని దళిత, మాదిగ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో జర్నలిస్టులను సమన్వయం చేసి ఫోరాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గొర్రె సుధాకర్, మల్యాల ప్రసాద్, పెంట మల్లికార్జున్, మల్యాల మధుకుమార్, జింక శ్రీకాంత్, నాగి సంతోష్, సుంకపాక వినయ్, ఉప్పరి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

టీఎంజేఎఫ్ రాష్ట్ర మూడవ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 11 (పున్నమి ప్రతినిధి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం (టీఎంజేఎఫ్) రాష్ట్ర మూడవ మహాసభల కరపత్రాలను గురువారం రాష్ట్ర నాయకులు సర్వాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. టీఎంజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ అధ్యక్షతన సెప్టెంబర్ 12న శనివారం హైదరాబాద్ కోఠిలోని బీసీసీఈ భవన్‌లో రాష్ట్ర మూడవ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా టీఎంజేఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తాత్కాలిక కమిటీని ప్రకటించారు. జిల్లా ఇన్‌చార్జిగా జింక శ్రీధర్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా కొల్లూరి సంతోష్, వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పెంట రామకృష్ణలను నియమించారు.
జిల్లా ఇన్‌చార్జి జింక శ్రీధర్ మాట్లాడుతూ.. సమాజానికి సమాచారాన్ని చేరవేయడంలో మాదిగ సామాజిక వర్గం కీలక పాత్ర పోషించిందన్నారు. మాదిగ జర్నలిస్టుల భద్రత, హక్కులు, సంక్షేమం, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం టీఎంజేఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మాదిగ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన ఇబ్బందులు, సామాజిక వివక్ష తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మహాసభలు కీలక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
జిల్లాలోని దళిత, మాదిగ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో జర్నలిస్టులను సమన్వయం చేసి ఫోరాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గొర్రె సుధాకర్, మల్యాల ప్రసాద్, పెంట మల్లికార్జున్, మల్యాల మధుకుమార్, జింక శ్రీకాంత్, నాగి సంతోష్, సుంకపాక వినయ్, ఉప్పరి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.