-టిటిడి పరిపాలన భవనం వద్ద ధర్నా: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, కందారపు మురళి
పున్నమి ప్రతినిధి,తిరుపతి జూలై 25
టిటిడిలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్, హెల్త్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, గార్డెన్, అగర్బత్తి కార్మికులకు, అన్నదానం క్యాంటీన్ కార్మికులకు, ఫారెస్ట్ కార్మికులకు, కళ్యాణ్ కట్ట, స్విమ్స్, బర్డ్, టిటిడి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు, పరకా మణిలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26 వేలుకు పెంచాలని నేడు టిటిడి పరి పాలన వద్ద కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి డిమాండ్ చేశారు.తిరుమలకు రోజు విచ్చేస్తున్న వేలాది భక్తులకు సేవలు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాల్సిన బాధ్యత టిటిడి పై ఉందన్నారు. పెరిగిన ధరలు, కుటుంబ పోషణ నిమిత్తం ప్రస్తుత మిస్తున్న 13 వేల రూపాయలు సరిపోదని, వచ్చే జీతంతో ఏ రకంగా కార్మికులు బతకతారో చెప్పాలని టిటిడి యాజమాన్యా న్ని ప్రశ్నించారు. భక్తులకు సేవ చేస్తున్న కార్మికులకు శ్రీవారి దర్శనం భాగ్యం కూడా కల్పించకపోవడం అన్యాయం అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు అన్న ప్రసాద క్యాంటీన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాలకమండలి చేసిన తీర్మానం ప్రకారం కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు దర్శన సౌకర్యం తోపాటు, లడ్డు, వడ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు. బ్రహ్మోత్సవాల లోపు కార్మికులకు న్యాయం జరగకపోతే వచ్చేనెల జరిగే బోర్డు మీటింగ్ నాటికి న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్. సిద్దయ్య, వి ప్రభాకర్ మాట్లాడుతూ ఎఫ్ఎంఎస్ లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గది వసతి సౌకర్యం కల్పించాలన్నారు.సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.జయచంద్ర,టి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సిఐటియు పోరాట ఫలితంగా గతంలో జీతాలు పెంచుకోవడం జరిగిందన్నారు. ఫారెస్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేసే కార్మికులకు పసుపు దార కుంకుమ దార ప్రాజెక్టుల వద్ద డ్యూటీలు చేసే సమయంలో ఎటువంటి రక్షణ లేదని అన్నారు. కనీసం తాగే వసతి కూడా లేదన్నారు. టిటిడి స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ నేతలు గోల్కొండ వెంకటేష్, కాటా గుణశేఖర్ మాట్లాడుతూ సొసైటీలలో పనిచేస్తున్న వారందరిని రెగ్యులరైజ్ చేయాలని టిటిడిని కోరారు. టిటిడి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయంగా జీతాలు పెంచాలని కోరారు.సిఐటియు నగర అధ్యక్షురాలు పి. బుజ్జి, సూపర్వైజర్స్ అండ్ టెక్నీషియన్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు డి. పార్థసారథి రెడ్డి, ఎన్ .రఘు మాట్లాడుతూ సూపర్వైజర్లను అటెండర్లుగా తీసుకోవాలని, టెక్నీషియన్లను వివిధ విభాగాల్లోకి విలీనం చేయాలన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం , శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ ఆర్. లక్ష్మి ,స్విమ్స్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ కే వేణుగోపాల్ మాట్లాడుతూ స్విమ్స్ కార్మికులుకు దీక్షలు సందర్భంగా టిటిడి యాజమాన్యం ఇచ్చిన హామీ ప్రకారం శానిటేషన్ పదాన్ని రద్దుచేసి, వార్డు బాయ్ హోదా మార్చాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు ఎన్. నరేంద్ర, పి చిన్న, టిటిడి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజారెడ్డి, త్యాగరాజులు, ఏకాంబరం, దేశయ్య, రామకృష్ణ, కేశవులు, కృష్ణమూర్తి, బాబు, దేవరాజులు, శివారెడ్డి, రెడ్డి శేఖర్ నాయుడు, శీను, కృష్ణ, గార్డెన్ యూనియన్ యూనియన్ నాయకులు మునిరత్నం, మున్నా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

