జూలూరుపాడు: ఉమ్మడి ఖమ్మం జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ హాజరై జాతీయ జెండాతో యాత్రలో పాల్గొన్నారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరుకుళ్ళ వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆపద రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు భూక్య రమేష్, కిసాన్ మోర్చా నాయకులు రామారావు, సిరిపురపు ప్రసాద్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సిరిపరపు పుల్లారావు, గోపాల్ రావు, భూక్య రాంబాబు, భూక్య చరణ్, బాబూలాల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని దేశభక్తి నినాదాలతో యాత్ర నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.



