Saturday, 11 July 2026
  • Home  
  • జులై 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు..
- ఖమ్మం

జులై 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు..

ఖమ్మం జులై (పున్నమి న్యూస్ ) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జులై 14న రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ ఆపై స్థాయి కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ ఖమ్మం నగర శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఏబీవీపీ కార్యాలయంలో నగర కార్యదర్శి దీకొండ కార్తీక్ అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర కార్య సమితి సభ్యులు చావా ప్రణీత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.10 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడవద్దని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న జులై 14 కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఖమ్మం నగర కార్యదర్శి దీకొండ కార్తీక్, సంయుక్త కార్యదర్శి దీపక్, కార్యకర్తలు అభినవ్, మహేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ )

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జులై 14న రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ ఆపై స్థాయి కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ ఖమ్మం నగర శాఖ ప్రకటించింది.

ఈ సందర్భంగా ఖమ్మంలోని ఏబీవీపీ కార్యాలయంలో నగర కార్యదర్శి దీకొండ కార్తీక్ అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర కార్య సమితి సభ్యులు చావా ప్రణీత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.10 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడవద్దని అన్నారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న జులై 14 కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఖమ్మం నగర కార్యదర్శి దీకొండ కార్తీక్, సంయుక్త కార్యదర్శి దీపక్, కార్యకర్తలు అభినవ్, మహేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.