Friday, 14 August 2026
  • Home  
  • జాతీయ బ్యాడ్మింటన్‌లో నెల్లూరు విద్యుత్ శాఖ జట్టు సత్తా
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ బ్యాడ్మింటన్‌లో నెల్లూరు విద్యుత్ శాఖ జట్టు సత్తా

విజయంలో కీలకపాత్ర పోషించిన ఆత్మకూరు లైన్మెన్ ఉదయ్ ఆత్మకూరు, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): కాకినాడలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నెల్లూరు విద్యుత్ శాఖ జట్టు విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా సుమారు 50 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ఫైనల్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన నెల్లూరు జట్టు ఛాంపియన్‌షిప్ కప్పును కైవసం చేసుకుంది.నెల్లూరు సర్కిల్ జట్టు విజయంలో ఆత్మకూరు ప్రాంతానికి చెందిన లైన్మెన్ ఉదయ్ కీలకపాత్ర పోషించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో తనవంతు సహకారం అందించారు. జాతీయ స్థాయిలో విజయం సాధించి నెల్లూరు సర్కిల్‌కు పేరు తీసుకురావడం పట్ల విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నెల్లూరు విద్యుత్ శాఖ ఎస్సీ రాఘవేంద్రన్ లైన్మెన్ ఉదయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతగా నిలిచిన జట్టు సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

విజయంలో కీలకపాత్ర పోషించిన ఆత్మకూరు లైన్మెన్ ఉదయ్

ఆత్మకూరు, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): కాకినాడలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నెల్లూరు విద్యుత్ శాఖ జట్టు విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా సుమారు 50 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ఫైనల్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన నెల్లూరు జట్టు ఛాంపియన్‌షిప్ కప్పును కైవసం చేసుకుంది.నెల్లూరు సర్కిల్ జట్టు విజయంలో ఆత్మకూరు ప్రాంతానికి చెందిన లైన్మెన్ ఉదయ్ కీలకపాత్ర పోషించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో తనవంతు సహకారం అందించారు. జాతీయ స్థాయిలో విజయం సాధించి నెల్లూరు సర్కిల్‌కు పేరు తీసుకురావడం పట్ల విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నెల్లూరు విద్యుత్ శాఖ ఎస్సీ రాఘవేంద్రన్ లైన్మెన్ ఉదయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతగా నిలిచిన జట్టు సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.