శ్రీ కాళహస్తి, జులై 31, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ జనసేన అధ్యక్షులు భవాని శంకర్ మాతృమూర్తి రామానాయుడు లక్ష్మి అనారోగ్యంతో పరమపదించడం అత్యంత బాధాకరమని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు దండి నరేంద్ర పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలోని భవాని శంకర్ నివాసంలో శనివారం జరిగిన రామానాయుడు లక్ష్మి దశదిన కర్మ కార్యక్రమానికి దండి నరేంద్ర విచ్చేశారు. అక్కడ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి పవిత్ర నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో భవాని శంకర్‌కు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కష్టసమయంలో ప్రతి జనసైనిక కుటుంబానికి జనసేన తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసైనికుల ఆనందంలో భాగస్వాములమవడం ఎంత బాధ్యతో, వారి కష్టకాలంలో తోడుగా నిలవడం అంతకంటే గొప్ప బాధ్యత అని తాము నమ్ముతున్నట్లు దండి నరేంద్ర స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో దండి నరేంద్రతో పాటు జనసేన నాయకులు లక్ష్మణ్, నవీన్, జనశంకర్, దివాకర్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

జనసేన పట్టణాధ్యక్షుడి మాతృమూర్తి దశదిన కర్మలో పాల్గొన్న దండి నరేంద్ర