గౌతమ్ మోడల్ స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు
————————————————————–
వెలుగుల పండుగలో విద్యార్థుల సందడి – పర్యావరణ పరిరక్షణకు పిలుపు
జనగామ పట్టణం లోని గౌతమ్ మోడల్ స్కూల్లో దీపావళి పండుగ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పాఠశాల ప్రాంగణం దీపాల వెలుగులు, రంగురంగుల అలంకరణలతో పండుగ శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా విద్యార్థులు దీపావళి పండుగ విశిష్టతను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పాఠశాల
డైరెక్టర్ మోతె సురేందర్ రెడ్డి తమ సందేసాన్ని ఇచ్చారు.తను మాట్లాడుతూ, దీపావళి అనేది కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞానం, మానవత్వం, ప్రేమ, సానుకూల ఆలోచనల వెలుగులు నింపే పండుగ అని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా
పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డి. అహమ్మద్ పాషా మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఒక జ్ఞానదీపంలా మారి తన కుటుంబానికి, సమాజానికి వెలుగులు పంచాలని సూచించారు. పండుగలను ఆనందంగా జరుపుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, కాలుష్యరహిత దీపావళిని జరుపుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించింది.
“ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు విరజిల్లాలి… ప్రతి మనసులో జ్ఞానజ్యోతి వెలగాలి…”
గౌతమ్ మోడల్ స్కూల్ జనగామ యాజమాన్యం తరఫున అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు


