పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డి
బోగోలు మండలంలో CMO గోపుల రమణయ్య గారి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా జడ్.పీ.హెచ్.ఎస్ పాత బిట్రగుంట, ఎం.పి.పి.ఎస్ కొండువల్లి జిని, ఎం.పి.పి.ఎస్ ఉమామహేశ్వర్ పురం పాఠశాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో పరిశీలించినటువంటి అంశాలు టీచర్ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్, వర్క్ బుక్, HPC కార్డ్స్, మధ్యాహ్న భోజనం అసెస్మెంట్ బుక్ సంబంధించి పరిశీలించడం జరిగింది. విద్యార్థులు సామర్థ్యములను, 10వ తరగతిలో మిషన్ మార్క్స్-2026-27 కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో దానికి సంబంధించి ఎగ్జామ్స్ మార్క్స్ రికార్డ్స్ కూడా పరిశీలన చేశారు.
ఆయా పాఠశాలలో పరిశీలించిన అంశాలను పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి, వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
టాస్క్‌ఫోర్స్ టీమ్ సభ్యులు శ్రీ ఎం. రమణయ్య గారు, డైట్ ఫ్యాకల్టీ S. హరిబాబు, Sd. Shameer, మండలం విద్యాశాఖాధికారి గారు పాల్గొన్నారు.


