గ్రామ సర్పంచ్ తిర్మని నాగరాజు గౌడ్ గారు, వారి ఆధ్వర్యంలో AE బొమ్మలరామారం గారికి మరియు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు.
విషయం:
చీకటిమామిడి గ్రామాన్ని ప్రస్తుతం ఉన్న సోలిపేట్ ఇండస్ట్రియల్ ఫీడర్ నుండి వేరు చేసి, గ్రామానికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్‌ను మంజూరు చేయాలని కోరారు.
అలాగే, వర్షాకాలంలో గ్రామంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ఉండేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 25 విద్యుత్ స్థంభాలు మరియు ఒక బ్రేకర్ మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న గారు సంబంధిత అధికారులకు వినతిపత్రాన్ని అందజేసి, గ్రామ ప్రజల సమస్యను సానుకూలంగా పరిశీలించి తక్షితగతిన పరిష్కరించాలని కోరారు.
పున్నమి న్యూస్ చీకటిమామిడి


