ఓబులవారిపల్లి మండలం చిన్నంపల్లి హరిజనవాడ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషక మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గుణవతి హాజరై గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు తగిన పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. పోషకాహారంతో పాటు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు.
శిశు ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని గుణవతి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఎన్‌పీ ఉపాధ్యాయిని లక్ష్మీప్రసన్న, అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

చిన్నంపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషక మాసోత్సవ వేడుకలు
ఓబులవారిపల్లి మండలం చిన్నంపల్లి హరిజనవాడ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషక మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గుణవతి హాజరై గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు తగిన పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. పోషకాహారంతో పాటు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. శిశు ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని గుణవతి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఎన్‌పీ ఉపాధ్యాయిని లక్ష్మీప్రసన్న, అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

