Tuesday, 4 August 2026
  • Home  
  • చింతకుంట చెరువులో పడి యువకుడి మృతి
- నిర్మల్

చింతకుంట చెరువులో పడి యువకుడి మృతి

ముథోల్, ఆగస్టు 3(పున్నమి ప్రతినిధి ):ముథోల్ మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన అర్షాల బాబు (18) సోమవారం ప్రమాదవశాత్తు గ్రామ చెరువులో పడి మృతి చెందాడు. మధ్యాహ్నం చెరువు ఒడ్డున అతని చెప్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాలింపు చేపట్టగా కొద్దిసేపటి తర్వాత చెరువులో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ముతన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.