మేడ్చల్ (పున్నమి న్యూస్ ప్రతినిధి – సందీప్):
అహ్మద్‌గూడ డబుల్ బెడ్రూమ్ కాలనీకి చెందిన క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రతినిధులు మేడ్చల్ ఆర్డీఓ నల్ల వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
కాలనీలోని క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా చర్చి నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా వారు ఆర్డీఓను కోరారు. స్థానిక ప్రజల ప్రార్థనల అవసరాల కోసం స్థలం అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు.
వినతిపత్రం స్వీకరించిన ఆర్డీఓ నల్ల వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్ (ఎమ్ఆర్ఓ)కు ఆదేశాలు జారీ చేశారు. స్థలాన్ని పరిశీలించి, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

చర్చి నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఆర్డీఓకు వినతి
మేడ్చల్ (పున్నమి న్యూస్ ప్రతినిధి – సందీప్): అహ్మద్‌గూడ డబుల్ బెడ్రూమ్ కాలనీకి చెందిన క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రతినిధులు మేడ్చల్ ఆర్డీఓ నల్ల వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలనీలోని క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా చర్చి నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా వారు ఆర్డీఓను కోరారు. స్థానిక ప్రజల ప్రార్థనల అవసరాల కోసం స్థలం అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. వినతిపత్రం స్వీకరించిన ఆర్డీఓ నల్ల వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్ (ఎమ్ఆర్ఓ)కు ఆదేశాలు జారీ చేశారు. స్థలాన్ని పరిశీలించి, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

