Wednesday, 22 April 2026
  • Home  
  • చంద్రారెడ్డి భౌతికకాయానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి
- తిరుపతి

చంద్రారెడ్డి భౌతికకాయానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాళ్లెం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు పల్లమాల చంద్రారెడ్డి అకాల మరణం పట్ల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం బొక్కసంపాళ్లెం వెళ్లిన ఎమ్మెల్యే.. చంద్రారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిన్నటి వరకు తమ మధ్యే ఉండి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన చంద్రారెడ్డి మరణం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు పెద్ద లోటని పేర్కొన్నారు. కార్యకర్తగా, నాయకుడిగా ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.