అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటికొప్పాక మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ భజంత్రీల లక్ష్మీ గారికి పదవి ముగిసిన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, సీనియర్ నాయకులు పప్పల చలపతిరావు, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరావు, మాజీ ఎంపీపీ విజయ్ బాబు చేతుల మీదగా ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, దేవరపు మోహన్, దారా పోలిశెట్టి, పోలుమూరి నాగేశ్వరరావు, ఊడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.



