పున్నమి: నగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండలం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోడేరు మండలం నాగులపల్లి గ్రామం లో ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ జూన్ 2, 2014… తెలంగాణ చరిత్రలో మహోన్నతమైన రోజు దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం, లక్షలాది మంది ప్రజల ఆకాంక్షలు, విద్యార్థుల ఆత్మబలిదానాలు, యువత పోరాటాలు, ఉద్యోగుల ఉద్యమాలు, రైతుల త్యాగాలు ఫలించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.
తెలంగాణ సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు జైళ్లకు వెళ్లారు. అనేక మంది యువకులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. వారి త్యాగాలు, ప్రజల అచంచల సంకల్పం, నిరంతర పోరాట స్ఫూర్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి అమరవీరుడు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లో గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ సెక్రెటరీ నరసింహ యాదవ్, ఉప సర్పంచ్ సంకటి సాయిలీల రామకృష్ణ, మల్లెపల్లి బాబు రెడ్డి, దూపం అంజనేయులు, మిద్దెల కృష్ణ, మన్నే నరేందర్ రెడ్డి, దాసరాజుల రవి, వీరపాగ శివకుమార్, వెంకట్ దాస్, దూపం శ్రీనివాసులు, చేలిమెండ్ల శీను, దుదుకురి నరేష్, వీరపాగ వెంకటస్వామి, సిరిగిరి మషన్న, గగనం మహేష్, వీరపాగ చెన్నకేశవులు, మండ్ల పరమేష్, వడ్ల కృష్ణ, గొల్ల సంజీవ, రామన్ గౌడ్, పిట్టల వీరస్వామి, దుద్దుకూరి మంత్రాల్లి, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
*మీ దూపం అంజనేయులు*✍️
*నాగులపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్*


