ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు
నెల్లూరు, అక్టోబర్ 2 (పున్నమి విలేకరి) : నెల్లూరులో జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న మహాత్ముడి విగ్రహానికి జిల్లా కలెక్టర్ శేషగిరిరావు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భారతావనికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన మహనీయులు మహాత్మాగాంధీ అని అన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివని తెలిపారు.