గూడూరు: సర్వేపల్లి అందరికి ఆదర్శప్రాయుడని, అయన పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని గూడూరు జిల్లా ప్రజాపరిషత్ బాలికల పాఠశాల హెచ్.యమ్. మాధవి లక్ష్మీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు 5 కేవలం ఉత్సవాల కోసం కాకుండా విద్యార్థుల గొప్ప భవిష్యత్తుకు పునాదిగా మార్చుకోవాలని విద్యార్థులను కోరారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతిగా పనిచేసిన గొప్ప తత్వవేత్త మరియు విద్యావేత్తగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందారని, విద్యార్థులపై ఆయనకున్న ప్రేమకు గుర్తుగా, ఆయన జన్మదినాన్ని ప్రతిఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ముదావహమని మాధవి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో హెచ్.యమ్. తో పాటు టీచర్లు, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు