పున్నమి న్యూస్ హరికృష్ణ జులై 21 చిట్టమూరు మండలం,
గొల్లలనట్టు నుండి కుమ్మరిపాలెం వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది.
ఈ రహదారిపై ప్రతిరోజు విద్యార్థులు,రైతులు,ఉద్యోగులు మరియు ఇతర వాహనదారులు ప్రయాణిస్తున్నారు.
ప్రజల రోడ్డు సగరం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినా ఈ విషయంపై పట్టించుకునే ప్రజాప్రతినిధులు గాని, సంబంధిత అధికారులు గానీ అటు వైపు చూసి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు అని స్థానికులు వ్యాపోతున్నారు.
రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వర్షానికి రోడ్డు పూర్తిగా, పెద్ద పెద్ద గుంటలతో బురదమయంగా మారడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో విద్యార్థులు రైతులు ఉద్యోగులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వాలు ఎన్నిసార్లు మారిన ఈ రహదారి సమస్య మాత్రం అలాగే కొనసాగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.
పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన శాశ్వత పరిష్కారం లభించలేదని వారు పేర్కొన్నారు.
కనీసం ప్రస్తుతం ప్రభుత్వం అయినా ఈ రహదారి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి , వెంటనే రోడ్డు నిర్మాణ లేదా మరమ్మతులు పనులు చేపట్టి ప్రజల కష్టాలు తీర్చాలని కొత్తపాలెం, బురద గల్లి,కుమ్మరిపాలెం గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.



