గురు పౌర్ణమి సందర్భంగా కొత్తవలస విజయనగరం రోడ్ లో గల హై స్కూల్ రాజీవ్ నగర్ కాలనీ దగ్గర ఉన్న శిరిడి సాయి గుడి దగ్గర భారీ అన్నదాన కార్యక్రమం
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 29. ( పున్నమి ప్రతినిధి )
కొత్తవలస మండలం కొత్తవలస గ్రామంలో విజయనగరం రోడ్ లో మరి పోలీస్ స్టేషన్ దగ్గరలో వేలిచినటువంటి షిరిడి సాయి స్వామివారు 2013లో ఇక్కడ వెలిచినరని, 2013 నుంచి కూడా బాబా గారి చల్లని ఆశీస్సులతో దీవెనలతో కమిటీ సభ్యులు అందరమూ కూడా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో గాని ఇతర ఇతర కార్యక్రమాలలో గాని చురుగ్గా పాల్గొనడం జరిగిందని, మరి 2013 నుంచి కూడా 13 సంవత్సరాలు సుమారు గురుపూర్ణిమ సందర్భంగా బాబా తాలూకు ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయని, మరి ఈ సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగిందని, ముఖ్యంగా రాజీవ్ నగర్ కాలనీ నివాసులు మాకు సహాయ సహకారములు అందిస్తున్నారని, మరి ముఖ్యంగా నాలుగైదు సంవత్సరాల నుండి భారత్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కడారి రాజు మరి ముఖ్యంగా వారి విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మాకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఉత్సవాలు సక్రమంగా జరగడానికి వారి యొక్క కృషిని అభినందిస్తున్నాం మా కమిటీ వారికి మాకు ఉన్న స్తోమతబట్టి ఆర్థిక సాయం చేసుకుంటూ అలాగే విరివిగా విరాళాలు ఇచ్చిన దాతలఅందరికీ ప్రతి ఒక్కరికి కూడా శిరిడి సాయి దీవెనలు మెండుగా ఉండాలని అలాగే గ్రామం కూడా చక్కగా అభివృద్ధి పొందాలని టెంపుల్ కూడా ఇంకా అభివృద్ధి చేయాలని మా కమిటీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రముఖ అడ్వకేట్ గొడుగుల మహేంద్ర ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో కొత్తవలస మాజీ మండల ప్రెసిడెంట్ గోరపల్లి రాము, డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కడారి రాజు, టిడిపి నాయకులు ప్రసాద్, బాణాది శ్రీను డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు దాతలు పాల్గొన్నారు.


