(పున్నమి ప్రతినిధి, నెల్లూరు )
ఆంద్ర పద్రేశ్ పరిశ్రమలు. ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (50) ఆకస్మికంగా మృతి చెందారు. గుండె పోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వారం రోజుల పాటు దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొని ఇండియా వచ్చారు. గౌతంరెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ న మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
గుండె పోటుతో మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి
(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) ఆంద్ర పద్రేశ్ పరిశ్రమలు. ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (50) ఆకస్మికంగా మృతి చెందారు. గుండె పోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వారం రోజుల పాటు దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొని ఇండియా వచ్చారు. గౌతంరెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ న మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.