Sunday, 28 June 2026
  • Home  
  • గిరిజన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి-మాసారపు సుబ్బయ్య
- తిరుపతి

గిరిజన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి-మాసారపు సుబ్బయ్య

శ్రీ కాళహస్తి, జూన్ 27, (పున్నమి న్యూస్) : తిరుపతి జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యుడు మాసారపు సుబ్బయ్య జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌ను కోరారు. ఆదివారం తిరుపతి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గిరిజన గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా సదుపాయాలు, వసతి సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గిరిజన కాలనీలో చిన్నారుల పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలను దృష్టిలో ఉంచుకుని మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలను వేగవంతం చేయాలని సుబ్బయ్య కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.