శ్రీ కాళహస్తి, ఆగస్టు 08, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని కాసా గార్డెన్ సమీపంలో గల బి.ఆర్. అంబేద్కర్ బాలికల గిరిజన పాఠశాల పక్కన నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి ఎత్తు పెరిగింది. దీనివల్ల హైవేకు ఆనుకుని ఉన్న పాఠశాల మరుగుదొడ్లు రహదారిపై వెళ్లేవారికి స్పష్టంగా కనిపిస్తూ విద్యార్థినులకు ఇబ్బందిగా మారాయి. ఈ సమస్యను పాఠశాల ప్రిన్సిపాల్ పి. మాధవీలత… శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినుల గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని సాయి ప్రసాద్ తక్షణమే స్పందించారు. తన సొంత నిధులతో పాఠశాలకు గ్రీన్ మ్యాట్ అందజేసి, జనసైనికుల సహకారంతో దానిని పాఠశాల చుట్టూ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ, ఆడబిడ్డలకు అండగా నిలబడటమే జనసేన పార్టీ ఆశయమని, విద్యార్థినులు, మహిళల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.

గిరిజన బాలికల పాఠశాలకు ‘గ్రీన్ మ్యాట్’ రక్షణ-చైర్మన్ కొట్టే సాయి చొరవ