నర్సంపేట పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అర్థ శతాబ్దం (50 సంవత్సరాలు) పూర్తయిన పురస్కరించుకుని, విగ్రహ దాత సతీమణి మైసవీర్ లచ్చమ్మ గారిని బుధవారం నాడు శాలువాతో ఘనంగా సత్కరించారు.
గతంలో పూజ్య బాపూజీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నర్సంపేట పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రముఖ గుత్తేదార్ ఎమ్మార్ స్వామి (మైస రామస్వామి అలియాస్ గుత్తేదార్ రామస్వామి) గారు స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు. నాటి నుండి ఇప్పటివరకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని నాటి విగ్రహ దాత ఎమ్మార్ స్వామి గారి సతీమణి మైసవీర్ లచ్చమ్మ గారి సేవలను, వారి కుటుంబ సభ్యుల ఉదారతను నర్సంపేట ప్రజల తరఫున గుర్తుచేసుకుంటూ ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్, వరంగల్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి గాంధీజీ విగ్రహం ఒక చారిత్రక చిహ్నంగా నిలిచింది. 50 ఏళ్ల క్రితం ఎమ్మార్ స్వామి గారు చూపిన మామకారానికి నర్సంపేట ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. వారి జ్ఞాపకాలను పునశ్చరణ చేసుకుంటూ, వారి సతీమణి లచ్చమ్మ గారిని గాంధీ జయంతి రోజున సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

గాంధీజీ విగ్రహ ఏర్పాటుకు 50 ఏళ్లు: విగ్రహ దాత సతీమణికి ఘన సత్కారం
నర్సంపేట పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అర్థ శతాబ్దం (50 సంవత్సరాలు) పూర్తయిన పురస్కరించుకుని, విగ్రహ దాత సతీమణి మైసవీర్ లచ్చమ్మ గారిని బుధవారం నాడు శాలువాతో ఘనంగా సత్కరించారు. గతంలో పూజ్య బాపూజీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నర్సంపేట పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రముఖ గుత్తేదార్ ఎమ్మార్ స్వామి (మైస రామస్వామి అలియాస్ గుత్తేదార్ రామస్వామి) గారు స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు. నాటి నుండి ఇప్పటివరకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని నాటి విగ్రహ దాత ఎమ్మార్ స్వామి గారి సతీమణి మైసవీర్ లచ్చమ్మ గారి సేవలను, వారి కుటుంబ సభ్యుల ఉదారతను నర్సంపేట ప్రజల తరఫున గుర్తుచేసుకుంటూ ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్, వరంగల్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి గాంధీజీ విగ్రహం ఒక చారిత్రక చిహ్నంగా నిలిచింది. 50 ఏళ్ల క్రితం ఎమ్మార్ స్వామి గారు చూపిన మామకారానికి నర్సంపేట ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. వారి జ్ఞాపకాలను పునశ్చరణ చేసుకుంటూ, వారి సతీమణి లచ్చమ్మ గారిని గాంధీ జయంతి రోజున సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

