నర్సంపేట డివిజన్, ఖానాపురం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి బాబు గారు పాల్గొని పథకం ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖానాపురం గ్రామ సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, ఎంపీడీవో, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్