ఖమ్మం రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ఫారం నంబర్ 1 సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒడిశాకు చెందిన గజేంద్ర నాయక్‌ను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడినట్లు ఆర్పీఎఫ్ సీఐ సురేష్ గౌడ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.55 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ సలాం, సిబ్బంది గురవయ్య, మహేష్ పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.



