ఖమ్మం: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అక్టోబర్ 1న ఖమ్మం టీటీడీసీ (TTDC)లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి 20 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతి లేదా ఆపై విద్యార్హత కలిగి, 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల వేతనంతో పాటు ఇన్సెంటివ్‌లు అందజేస్తారని వివరించారు. ద్విచక్ర వాహనం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హత, ఇతర ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని మాధవి సూచించారు.



