పున్నమి న్యూస్ హరికృష్ణ జులై 29 కోట మండలం,
నెల్లూరు జిల్లా కోట దరువు కట్ట గ్రామానికి చెందిన మనస్వి తాత దువ్వూరు వెంకటరమణారెడ్డి రాజకీయరంగంలో రాణిస్తున్నారు,
ఆ విద్యార్థిని తండ్రి సాయి కృష్ణారెడ్డి వ్యాపారం రంగంలోనూ రాజకీయంలోనూ రాణిస్తున్నారు.
ఒకే కుటుంబంలో రాజకీయాలు,వ్యాపారాలు క్రీడార రంగంలో గుర్తింపు దక్కించుకోవడం ఈ కుటుంబ ప్రత్యేకత,
వీరి స్వగ్రామం కోట మండలం, దరువు కట్ట*
సిబి ఎస్ ఈ సౌత్ జోన్ -1 రైఫిల్ పి స్టాల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026 లో స్వర్ణ ప్రతాపం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన దువ్వూరు మనశ్విని నెల్లూరు జిల్లా కలెక్టర్ హి మాన్స్ శుక్ల, తన కార్యాలయంలో అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన జిల్లాలో ఎంతటి ప్రతిభావంతులైన క్రీడాకారులు అనటం ఎంతో ఆనందంగా ఉంది.
మనస్వి జాతీయస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్కు మరింత కీర్తి తీసుకురావాలని కోరుకుంటున్నాను.
జిల్లా పరిపాలన తరపున అవసరమైన సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం అని తెలిపారు.
ఈ సందర్భంగా మన మనస్వి తాత దూరు వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ , తన మనవరాలు సాధించిన విజయంపై హర్షం వ్యక్తం, చేస్తూ జాతీయ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా రాష్ట్రానికి,ప్రఖ్యాతలు తీసుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే ఆమె తండ్రి దువ్వూరు సాయి కృష్ణారెడ్డి అకాడమీ కోచ్ మనోహర్ మనస్విని అభినందించారు.
కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా దుగరాజపట్నం కు చెందిన చింతల సిరి సాయి, దేవి ఫీడ్స్ రీజనల్ మేనేజర్ హరి కూడా పాల్గొన్నారు.



