Wednesday, 30 September 2026
  • Home  
  • క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే తాతయ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే తాతయ్య

చిల్లకల్లు ప్రతినిధి విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు స్కూల్ గేమ్స్ సెలెక్షన్స్ ఎంతగానో దోహదపడతా యని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల 70వ స్కూల్ గేమ్స్ సెలెక్షన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్యఅతిథిగా హాజరై సెలెక్షన్స్‌ను ప్రారంభించారు. ఈ సెలెక్షన్స్‌లో అండర్-14, అండర్-17 బాలబాలికలకు గట్కా (GATKA), తాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ (TANG TA), కలరిపయట్టు(KALARIPAYATTU) తదితర క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నలుమూలల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ గంటా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పించేందుకు స్కూల్ గేమ్స్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గట్కా, తాంగ్-టా మార్షల్ ఆర్ట్స్, కలరిపయట్టు వంటి క్రీడాంశాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థు లను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేసి, వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలనుపెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రభుత్వం, అధికారులు, ఉపాధ్యాయులు అవసరమైన ప్రోత్సాహం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో రావూరి విశ్వనాథం, తాళ్లూరి వెంకటేశ్వరరావు, కారుపాటి డేవిడ్, నందిగామ డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యు.గురునాథం, గట్కా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి మోహన్ లక్ష్మి, కోచ్ శ్రీకాంత్, హెడ్‌మాస్టర్ కోటేశ్వరరావు, పీడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

చిల్లకల్లు ప్రతినిధి

విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు స్కూల్ గేమ్స్ సెలెక్షన్స్ ఎంతగానో దోహదపడతా యని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు.
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల 70వ స్కూల్ గేమ్స్ సెలెక్షన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్యఅతిథిగా హాజరై సెలెక్షన్స్‌ను ప్రారంభించారు.
ఈ సెలెక్షన్స్‌లో అండర్-14, అండర్-17 బాలబాలికలకు గట్కా (GATKA), తాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ (TANG TA), కలరిపయట్టు(KALARIPAYATTU) తదితర క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నలుమూలల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ గంటా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పించేందుకు స్కూల్ గేమ్స్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గట్కా, తాంగ్-టా మార్షల్ ఆర్ట్స్, కలరిపయట్టు వంటి క్రీడాంశాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థు లను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేసి, వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలనుపెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రభుత్వం, అధికారులు, ఉపాధ్యాయులు అవసరమైన ప్రోత్సాహం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో రావూరి విశ్వనాథం, తాళ్లూరి వెంకటేశ్వరరావు, కారుపాటి డేవిడ్, నందిగామ డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యు.గురునాథం, గట్కా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి మోహన్ లక్ష్మి, కోచ్ శ్రీకాంత్, హెడ్‌మాస్టర్ కోటేశ్వరరావు, పీడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.