కోట ఆకుతోట దిబ్బలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు
భక్తులు, పేదలకు అన్నదానం
*అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు తీగల సురేష్ బాబు*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 కోట మండలం,*
నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని ఆకుతోట దిబ్బ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేస్తున్నారు. శుక్రవారం ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులు సాధన కిరణ్, ఉక్కు కిషోర్, రాఘవ, రాజా, పఠాన్ మౌలా బాష తదితరుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్ నాయకులు తీగల సురేష్ బాబు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, పేదలకు భోజనం వడ్డించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఉత్సవ ప్రాంగణంలో భక్తులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్థానికులు, భక్తులు ఉత్సవ ఏర్పాట్లలో భాగస్వాములవుతూ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.



