విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 16.( పున్నమి ప్రతినిధి )
FBC క్లబ్ నూతన కమిటీని ఆదివారం జరిగిన సభ్యుల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, అలాగే క్లబ్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సభ్యులు తెలిపారు.
నూతన కమిటీ అధ్యక్షుడిగా జి. మహేంద్ర, ఉపాధ్యక్షుడిగా ఎ . సోమేష్, కార్యదర్శిగా టీ .రవి, సహాయ కార్యదర్శిగా ఎస్ . తాతారావు, కోశాధికారిగా డి . శ్రీనివాసరాజు ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షులుగా సూరిబాబు మరియు అన్నాజీ బాధ్యతలు స్వీకరించారు.
కమిటీ సభ్యులుగా పి . రఘునాథ్, వై.నాగరాజు, ఆర్. ప్రసాదరావు, కె . అప్పలరాజు (మిల్క్ బుజ్జి), కె . అప్పలబుచ్చి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని, సభ్యుల సహకారంతో మరిన్ని సేవా, క్రీడా మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ప్రతిష్ఠను మరింత పెంపొందిస్తామని తెలిపారు. సమావేశంలో సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.



