భద్రాద్రి కొత్తగూడెం:- 14/09/2026 పున్నమి ప్రతినిధి
కొత్తగూడెం గణేష్ ఆలయంలో వినాయక చతుర్థి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రముఖ నాయకులు ఎస్.కె. సాబీర్ పాషా మరియు కంచర్ల జమాలయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన స్వామివారికి వీరు ప్రత్యేక ప్రార్థనలు, మహామంగళ హారతి సమర్పించి పూజాది కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకులు వారికి మంత్రోచ్ఛారణల నడుమ తీర్థప్రసాదాలు అందించి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరియు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


