కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ), ఆనందపురంలో ప్రపంచ జీవన నైపుణ్యాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల్లో జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు.
విద్యార్థినులు లైఫ్ స్కిల్స్ Skits ను ప్రదర్శించి వాటి వినియోగాన్ని వివరించారు. అలాగే జీవన నైపుణ్యాలు, వృత్తి విద్య అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. చిత్రలేఖన పోటీలు నిర్వహించగా విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.
పోటీల్లో మరియు ప్రాజెక్టుల ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి D. చంద్రకళ మాట్లాడుతూ, జీవన నైపుణ్యాలు విద్యార్థుల వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన జీవితాల్లో ఎంతో కీలకమైనవని తెలిపారు. సమస్య పరిష్కార సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, సంభాషణా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం వంటి జీవన నైపుణ్యాలు ప్రతి విద్యార్థికి అవసరమని వివరించారు.

కేజీబీవీ ఆనందపురంలో ఘనంగా ప్రపంచ జీవన నైపుణ్యాల దినోత్సవం నిర్వహణ
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ), ఆనందపురంలో ప్రపంచ జీవన నైపుణ్యాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల్లో జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థినులు లైఫ్ స్కిల్స్ Skits ను ప్రదర్శించి వాటి వినియోగాన్ని వివరించారు. అలాగే జీవన నైపుణ్యాలు, వృత్తి విద్య అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. చిత్రలేఖన పోటీలు నిర్వహించగా విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీల్లో మరియు ప్రాజెక్టుల ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి D. చంద్రకళ మాట్లాడుతూ, జీవన నైపుణ్యాలు విద్యార్థుల వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన జీవితాల్లో ఎంతో కీలకమైనవని తెలిపారు. సమస్య పరిష్కార సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, సంభాషణా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం వంటి జీవన నైపుణ్యాలు ప్రతి విద్యార్థికి అవసరమని వివరించారు.

