అమ్మ ముఖంలో ఆనందం… బిడ్డల భవిష్యత్తుకు భరోసా! నాడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, పేద విద్యార్థుల చదువులకు కొండంత అండగా నిలిచే ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదల ఈరోజు నుంచే పండుగలా ప్రారంభం కాబోతోంది!
👉 నేరుగా తల్లుల ఖాతాల్లోకే… ప్రచారాల ఆర్బాటం లేదు, దళారుల ప్రమేయం లేదు! ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతీ అర్హులైన విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 13,000 లబ్ధిని మన చంద్రబాబు గారి ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది.
👉 పారదర్శకంగా… దశలవారీగా పంపిణీ! జులై 22 నుంచి 24వ తేదీ వరకు ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు బదిలీ (DBT) కానుంది.
“మానవ వనరుల వికాసమే ధ్యేయం… ప్రతీ బిడ్డ చదువుకూ మన ప్రభుత్వం గ్యారెంటీ!”


