వెంకయ్యనాయుడును కలవనున్న రవి కుటుంబం
వింజమూరు: వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లికి చెందిన ఆర్మీ సఫాయి ఉద్యోగి పగడాల రవి అదృశ్యమైన ఘటనపై కుటుంబ సభ్యులు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడును కలవనున్నారు. మంగళవారం వింజమూరులోని వై.ఆర్.జె.సి కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలకు వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి రవి అదృశ్యానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు తెలియజేయనున్నారు. రవి ఆచూకీ కోసం అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, అవసరమైన సహకారం అందించాలని వెంకయ్యనాయుడును కోరనున్నట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యుడి ఆచూకీ త్వరగా లభించేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు.

కుటుంబంవెంకయ్యనాయుడును కలవనున్న రవి కుటుంబం
వెంకయ్యనాయుడును కలవనున్న రవి కుటుంబం వింజమూరు: వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లికి చెందిన ఆర్మీ సఫాయి ఉద్యోగి పగడాల రవి అదృశ్యమైన ఘటనపై కుటుంబ సభ్యులు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడును కలవనున్నారు. మంగళవారం వింజమూరులోని వై.ఆర్.జె.సి కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలకు వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి రవి అదృశ్యానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు తెలియజేయనున్నారు. రవి ఆచూకీ కోసం అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, అవసరమైన సహకారం అందించాలని వెంకయ్యనాయుడును కోరనున్నట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యుడి ఆచూకీ త్వరగా లభించేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు.

