నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కావలిలో ఘోర ప్రమాదం: లారీ ఢీకొని బైకిస్ట్ మృతి!
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

1 Comment
Prabhalkumae
June 2, 2026శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ & పీజీ కళాశాల (అటానమస్), బద్వేలలు
అగ్నివీర్కి ఎంపికైన నాగభూషణం కళాశాల పూర్వ విద్యార్థిని
శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ & పీజీ కళాశాల (అటానమస్), బద్వేల్లో బి.ఎస్సి. విద్యను పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని జె. పూజిత అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో విజయవంతంగా ఎంపికయిందని కళాశాల పరిపాలన అధికారి రాచపూడి వెంకట సాయి కృష్ణ తెలిపారు.అగ్నివీర్ ర్యాలీలో అనేక మంది అభ్యర్థులతో పోటీపడి, తన కృషి, పట్టుదల, అంకితభావంతో పాటు ఎన్సీసీ ‘సి’ సర్టిఫికేట్ కలిగి ఉండడం ద్వారా లభించిన ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆమె ఈ విజయాన్ని సాధించిందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా తన విజయానికి నిరంతరం మార్గనిర్దేశనం, ప్రోత్సాహం మరియు సహకారం అందించిన కళాశాల యాజమాన్యం కు జె. పూజిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యన్. సి. సి తనకు ఎంతో ఉపయోగపడిందని ఆమె తెలిపారు.
కళాశాల డీన్ డాక్టర్ అశోక్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లిఫ్ట్నెంట్ బాల ఓబులేసు, పారామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ షాహిన, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ గంగరాజు, సి.ఈ డా! రామసుధ,జె. పూజితను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు