Friday, 11 September 2026
  • Home  
  • *కార్డియాక్ అరెస్ట్ను జయించి గుండె మార్పిడితో పునర్జన్మ పొందిన యువకుడు*
- సక్సెస్ స్టోరీస్

*కార్డియాక్ అరెస్ట్ను జయించి గుండె మార్పిడితో పునర్జన్మ పొందిన యువకుడు*

గుంటూరు… *కార్డియాక్ అరెస్ట్ను జయించి గుండె మార్పిడితో పునర్జన్మ పొందిన యువకుడు* *ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో అరుదైన విజయగాథ* శ్రీ గుండిమెడ వేద ప్రకాష్ అనే 26 సంవత్సరాల యువకుడు జీవితంపై ఎన్నో ఆశలు, ఆశయాలతో ముందుకు సాగుతున్న సమయంలో, కేవలం 23 సంవత్సరాల వయస్సులోనే తీవ్రమైన గుండె వ్యాధి ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. గత మూడు సంవత్సరాలుగా ఆయనకు నడిచినప్పుడు ఊపిరి అందకపోవడం, గుండె దడ, ఛాతిలో నొప్పి వంటి సమస్యలు కనిపించాయి. మొదట ఇవి సాధారణ అలసటలాగా అనిపించినా, క్రమంగా గుండె పనితీరు తీవ్రంగా బలహీనపడింది. 2023 మార్చిలో ఆయనకు తీవ్రమైన ఛాతి నొప్పి, స్పృహ కోల్పోవడం, చివరకు సడన్ కాగియాక్ అరెస్ట్ సంభవించింది. అత్యంత క్లిష్ట పరిస్థితిలో వైద్యులు అత్యవసరంగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సి.పి.ఆర్.) నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడగలిగారు. కార్డియాక్ అరెస్ట్ నుంచి ప్రాణాలతో బయటపడటం ఆయన జీవితంలో మొదటి పెద్ద విజయం అయింది. తదుపరి నిర్వహించిన కార్డియాక్ ఎం.ఆర్.ఐ. పరీక్షలో గుండె ఎడమ జఠరిక (Left Ventricle) తీవ్రంగా బలహీనపడినట్లు గుర్తించారు. గుండె పంపింగ్ సామర్థ్యం (Ejection Fraction) కేవలం 31-35 శాతం మాత్రమే ఉందని తేలింది. సాధారణంగా ఇది 55-60 శాతం మధ్య ఉండాలి. అంటే గుండె శరీరానికి అవసరమైన స్థాయిలో రక్తాన్ని పంపించలేని పరిస్థితికి చేరుకుందని వైద్యులు నిర్ధారించారు. దీనిని డయలేటెడ్ కార్డియోమయోపతి (Dilated Cardiomyopathy)గా గుర్తించారు. అంతేకాకుండా ఆయనకు ప్రాణాపాయమైన గుండె రిథమ్ సమస్యలు కూడా తలెత్తాయి. Monomorphic Ventricular Tachycardia అనే ప్రమాదకరమైన గుండె వేగంగా కొట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో డి.సి. షాక్ (DC Shock) ఇచ్చి గుండె స్పందనను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్షల్లో ప్రధాన రక్తనాళాల్లో ఎటువంటి బ్లాకులు కనిపించకపోయినా, రక్తప్రవాహం మందగించినట్లు వైద్యులు గుర్తించారు. భవిష్యత్తులో మళ్లీ సడన్ కార్డియాక్ అరెస్ట్ సంభవించే ప్రమాదం ఎక్కువగా ໖໐໕, 2024 2 3 ລ້ AICD (Automated Implantable Cardioverter Defibrillator) అమర్చారు. ఈ పరికరం గుండె అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా ప్రమాదకరమైన రిథమ్లోకి వెళ్లినప్పుడు వెంటనే స్పందించి ప్రాణాలను కాపాడుతుంది. అన్ని రకాల మందులు, చికిత్సలు కొనసాగించినప్పటికీ గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడలేదు. గుండె మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో పలు వైద్య సంస్థలను సంప్రదించినప్పటికీ ఆశాజనకమైన ఫలితం రాకపోవడంతో, చివరి ప్రయత్నంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుండె వైద్య నిపుణులను సంప్రదించారు. అనంతరం జీవన్డేన్ కార్యక్రమం ద్వారా గుండె మార్పిడి కోసం నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా శరీర బరువు 105 కిలోల వరకు చేరుకుంది. గుండె మార్పిడి శస్త్రచికిత్సకు అనుకూలంగా ఉండేందుకు వైద్యుల సూచన మేరకు కఠిన నియంత్రణ పాటించి తన బరువును 76 కిలోలకు తగ్గించుకోవడం ఆయన సంకల్పబలానికి నిదర్శనం. *గుండె మార్పిడి కోసం ఎదురుచూపులు పునర్జన్మగా మారిన అవయవదానం* ఇలాంటి క్లిష్ట సమయంలో విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల జీవన్మృతుడైన యువ దాత గుండె అందుబాటులోకి రావడం ఒక అద్భుత మలుపుగా మారింది. ఆ దాత కుటుంబం తీసుకున్న మహోన్నత నిర్ణయం ఈ యువకుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. మే 26, 2026న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు శ్రీకారం చుట్టారు. అత్యంత నైపుణ్యంతో కూడిన వైద్య బృందం సమిష్టి కృషితో గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. చిన్న వయస్సులోనే తీవ్రమైన గుండె వైఫల్యాన్ని ఎదుర్కొని, కార్డియాక్ అరెస్ట్ను జయించి, AICD సహాయంతో జీవితం కొనసాగించిన ఈ యువకుడు ఇప్పుడు గుండె మార్పిడి ద్వారా నిజమైన పునర్జన్మను పొందాడు. *మరో అరుదైన విజయాన్ని సాధించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య బృందం* ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్కు చెందిన ప్రముఖ కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, అనస్థీషియా నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు మరియు నర్సింగ్ బృందం సమిష్టి కృషితో గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో ప్రస్తుతం 6గురు సీనియర్ గుండె శస్త్రచికిత్స నిపుణులు సేవలందిస్తున్నారు. వున్నారు. డాక్టర్ మృత్యంజయ కుమార్ ఇప్పటి వరకు 25 గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ జయరామ్ పాయ్ మత్తు అందించకుండా నిర్వహించే అవేక్ బైపాస్ సర్జరీల్లో విశేష అనుభవం కలిగి డాక్టర్ శివ ప్రసాద్ అత్యవసర పరిస్థితుల్లో నిర్వహించే ఎమర్జెన్సీ బైపాస్ సర్జరీలు మరియు మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీలను 1000కు పైగా విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ అశోక్ కుమార్ మిడ్క్యాబ్ (MIDCAB), బైపాస్ మరియు వాల్వ్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డాక్టర్ భరత్ సిద్ధార్థ ఒక్క రోజు వయసున్న నవజాత శిశువులకు కూడా క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ మహాపాత్ర అన్ని రకాల గుండె శస్త్రచికిత్సల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు. దేశవ్యాప్తంగా ప్రముఖ వైద్య సంస్థల్లో సేవలందించిన ఈ వైద్య బృందం ఒక లక్షా పాతిక వేలకుపైగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించిన అనుభవం కలిగి ఉంది. క్లిష్టమైన శస్త్రచికిత్సల నిర్వహణలో అనుభవజ్ఞులైన ముగ్గురు డీ.ఎం. కార్డియాక్ అనస్థీషియా వైద్య బృందం కూడా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో సేవలందిస్తోంది. ఈ విజయగాథ అవయవ దానం యొక్క గొప్పతనాన్ని సమాజానికి మరోసారి గుర్తుచేస్తూ, “ఒక దానం… మరో జీవితానికి ఆశ” అనే సందేశాన్ని అందించిందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ & ట్రాన్స్ ప్లాంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. ఈ విజయగాథ స్ఫూర్తితో త్వరలోనే రోగులకు మరింత మెరుగైన అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు “రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలు” ప్రారంభించనున్నామని, పూర్తిస్థాయి అత్యాధునిక గుండె వైద్యానికి చిరునామాగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ రూపుదిద్దుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు అయ్యే వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రమేష్ హాస్పిటల్స్ ట్రస్ట్లు సంయుక్తంగా భరించాయని ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియచేసారు. ఈ మీడియా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సీనియర్ గుండె శస్త్రచికిత్స వైద్యనిపుణులు డాక్టర్ మృత్యంజయ కుమార్, డాక్టర్ జయరామ్ పాయ్, డాక్టర్ శివ ప్రసాద్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ భరత్ సిద్ధార్థ, డాక్టర్ శ్రీకాంత్ మహాపాత్ర, సీనియర్ డి.ఎం. కార్డియాక్ ఎనస్థీషియాలజిస్టులు డాక్టర్ లోగనాథ్ చక్రవర్తి, డాక్టర్ దమ్మాలపాటి పవన్, డాక్టర్ మిట్టపల్లి జీవన్బాబు, క్రిటికల్ కేర్ వైద్యనిపుణులు డాక్టర్ శిల్పా చౌదరి, కార్డియాలజిస్టులు డాక్టర్ రామారావు, డాక్టర్ రాజారమేష్, డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ నవీన్, డాక్టర్ వివేక్, డాక్టర్ రతన్ కిరీట్, డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జ్యోతిప్రకాష్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత పాల్గొన్నారు.

గుంటూరు…

*కార్డియాక్ అరెస్ట్ను జయించి గుండె మార్పిడితో పునర్జన్మ పొందిన యువకుడు*

*ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో అరుదైన విజయగాథ*

శ్రీ గుండిమెడ వేద ప్రకాష్ అనే 26 సంవత్సరాల యువకుడు జీవితంపై ఎన్నో ఆశలు, ఆశయాలతో ముందుకు సాగుతున్న సమయంలో, కేవలం 23 సంవత్సరాల వయస్సులోనే తీవ్రమైన గుండె వ్యాధి ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.

గత మూడు సంవత్సరాలుగా ఆయనకు నడిచినప్పుడు ఊపిరి అందకపోవడం, గుండె దడ, ఛాతిలో నొప్పి వంటి

సమస్యలు కనిపించాయి. మొదట ఇవి సాధారణ అలసటలాగా అనిపించినా, క్రమంగా గుండె పనితీరు తీవ్రంగా బలహీనపడింది.

2023 మార్చిలో ఆయనకు తీవ్రమైన ఛాతి నొప్పి, స్పృహ కోల్పోవడం, చివరకు సడన్ కాగియాక్ అరెస్ట్ సంభవించింది.

అత్యంత క్లిష్ట పరిస్థితిలో వైద్యులు అత్యవసరంగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సి.పి.ఆర్.) నిర్వహించి ఆయన ప్రాణాలను

కాపాడగలిగారు. కార్డియాక్ అరెస్ట్ నుంచి ప్రాణాలతో బయటపడటం ఆయన జీవితంలో మొదటి పెద్ద విజయం అయింది.

తదుపరి నిర్వహించిన కార్డియాక్ ఎం.ఆర్.ఐ. పరీక్షలో గుండె ఎడమ జఠరిక (Left Ventricle) తీవ్రంగా బలహీనపడినట్లు గుర్తించారు. గుండె పంపింగ్ సామర్థ్యం (Ejection Fraction) కేవలం 31-35 శాతం మాత్రమే ఉందని తేలింది. సాధారణంగా ఇది 55-60 శాతం మధ్య ఉండాలి. అంటే గుండె శరీరానికి అవసరమైన స్థాయిలో రక్తాన్ని పంపించలేని పరిస్థితికి చేరుకుందని వైద్యులు నిర్ధారించారు. దీనిని డయలేటెడ్ కార్డియోమయోపతి (Dilated Cardiomyopathy)గా గుర్తించారు. అంతేకాకుండా ఆయనకు ప్రాణాపాయమైన గుండె రిథమ్ సమస్యలు కూడా తలెత్తాయి. Monomorphic Ventricular Tachycardia అనే ప్రమాదకరమైన గుండె వేగంగా కొట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో డి.సి. షాక్ (DC Shock) ఇచ్చి గుండె స్పందనను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్షల్లో ప్రధాన రక్తనాళాల్లో ఎటువంటి బ్లాకులు కనిపించకపోయినా, రక్తప్రవాహం మందగించినట్లు వైద్యులు గుర్తించారు. భవిష్యత్తులో మళ్లీ సడన్ కార్డియాక్ అరెస్ట్ సంభవించే ప్రమాదం ఎక్కువగా ໖໐໕, 2024 2 3 ລ້ AICD (Automated Implantable Cardioverter Defibrillator) అమర్చారు. ఈ పరికరం గుండె అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా ప్రమాదకరమైన రిథమ్లోకి వెళ్లినప్పుడు వెంటనే స్పందించి ప్రాణాలను కాపాడుతుంది.

అన్ని రకాల మందులు, చికిత్సలు కొనసాగించినప్పటికీ గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడలేదు. గుండె మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో పలు వైద్య సంస్థలను సంప్రదించినప్పటికీ ఆశాజనకమైన ఫలితం రాకపోవడంతో, చివరి ప్రయత్నంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుండె వైద్య నిపుణులను సంప్రదించారు. అనంతరం జీవన్డేన్ కార్యక్రమం ద్వారా గుండె మార్పిడి కోసం నమోదు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా శరీర బరువు 105 కిలోల వరకు చేరుకుంది. గుండె మార్పిడి శస్త్రచికిత్సకు అనుకూలంగా ఉండేందుకు వైద్యుల సూచన మేరకు కఠిన నియంత్రణ పాటించి తన బరువును 76 కిలోలకు తగ్గించుకోవడం ఆయన సంకల్పబలానికి నిదర్శనం.

*గుండె మార్పిడి కోసం ఎదురుచూపులు పునర్జన్మగా మారిన అవయవదానం*

ఇలాంటి క్లిష్ట సమయంలో విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల జీవన్మృతుడైన యువ దాత గుండె అందుబాటులోకి రావడం ఒక అద్భుత మలుపుగా మారింది. ఆ దాత కుటుంబం తీసుకున్న మహోన్నత నిర్ణయం ఈ యువకుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

మే 26, 2026న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు శ్రీకారం చుట్టారు. అత్యంత నైపుణ్యంతో కూడిన వైద్య బృందం సమిష్టి కృషితో గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. చిన్న వయస్సులోనే తీవ్రమైన గుండె వైఫల్యాన్ని ఎదుర్కొని, కార్డియాక్ అరెస్ట్ను జయించి, AICD సహాయంతో జీవితం కొనసాగించిన ఈ యువకుడు ఇప్పుడు గుండె మార్పిడి ద్వారా నిజమైన పునర్జన్మను పొందాడు.

*మరో అరుదైన విజయాన్ని సాధించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య బృందం*

ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్కు చెందిన ప్రముఖ కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, అనస్థీషియా నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు మరియు నర్సింగ్ బృందం సమిష్టి కృషితో గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో ప్రస్తుతం 6గురు సీనియర్ గుండె శస్త్రచికిత్స నిపుణులు సేవలందిస్తున్నారు.

వున్నారు. డాక్టర్ మృత్యంజయ కుమార్ ఇప్పటి వరకు 25 గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ జయరామ్ పాయ్ మత్తు అందించకుండా నిర్వహించే అవేక్ బైపాస్ సర్జరీల్లో విశేష అనుభవం కలిగి

డాక్టర్ శివ ప్రసాద్ అత్యవసర పరిస్థితుల్లో నిర్వహించే ఎమర్జెన్సీ బైపాస్ సర్జరీలు మరియు మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీలను 1000కు పైగా విజయవంతంగా నిర్వహించారు.

డాక్టర్ అశోక్ కుమార్ మిడ్క్యాబ్ (MIDCAB), బైపాస్ మరియు వాల్వ్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

డాక్టర్ భరత్ సిద్ధార్థ ఒక్క రోజు వయసున్న నవజాత శిశువులకు కూడా క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు.

డాక్టర్ శ్రీకాంత్ మహాపాత్ర అన్ని రకాల గుండె శస్త్రచికిత్సల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు.

దేశవ్యాప్తంగా ప్రముఖ వైద్య సంస్థల్లో సేవలందించిన ఈ వైద్య బృందం ఒక లక్షా పాతిక వేలకుపైగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించిన అనుభవం కలిగి ఉంది.

క్లిష్టమైన శస్త్రచికిత్సల నిర్వహణలో అనుభవజ్ఞులైన ముగ్గురు డీ.ఎం. కార్డియాక్ అనస్థీషియా వైద్య బృందం కూడా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో సేవలందిస్తోంది.

ఈ విజయగాథ అవయవ దానం యొక్క గొప్పతనాన్ని సమాజానికి మరోసారి గుర్తుచేస్తూ, “ఒక దానం… మరో జీవితానికి ఆశ” అనే సందేశాన్ని అందించిందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ & ట్రాన్స్ ప్లాంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు.

ఈ విజయగాథ స్ఫూర్తితో త్వరలోనే రోగులకు మరింత మెరుగైన అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు “రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలు” ప్రారంభించనున్నామని, పూర్తిస్థాయి అత్యాధునిక గుండె వైద్యానికి చిరునామాగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ రూపుదిద్దుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు అయ్యే వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రమేష్ హాస్పిటల్స్ ట్రస్ట్లు సంయుక్తంగా భరించాయని ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియచేసారు.

ఈ మీడియా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సీనియర్ గుండె శస్త్రచికిత్స వైద్యనిపుణులు డాక్టర్ మృత్యంజయ కుమార్, డాక్టర్ జయరామ్ పాయ్, డాక్టర్ శివ ప్రసాద్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ భరత్ సిద్ధార్థ, డాక్టర్ శ్రీకాంత్ మహాపాత్ర, సీనియర్ డి.ఎం. కార్డియాక్ ఎనస్థీషియాలజిస్టులు డాక్టర్ లోగనాథ్ చక్రవర్తి, డాక్టర్ దమ్మాలపాటి పవన్, డాక్టర్ మిట్టపల్లి జీవన్బాబు, క్రిటికల్ కేర్ వైద్యనిపుణులు డాక్టర్ శిల్పా చౌదరి, కార్డియాలజిస్టులు డాక్టర్ రామారావు, డాక్టర్ రాజారమేష్, డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ నవీన్, డాక్టర్ వివేక్, డాక్టర్ రతన్ కిరీట్, డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జ్యోతిప్రకాష్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.