కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28 (పున్నమి న్యూస్): ఇటీవల కురిసిన వర్షాల వల్ల ముంపు లోనే ఉండి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్న వార్డులలో వెంటనే నీటిని తొలగించి రాకపోకలకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించారు.సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్…ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాకినాడ అర్బన్ పరిధిలో 43,48,49 వ వార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.కాకినాడ అర్బన్ పరిధిలో 49వ వార్డు మధురానగర్,అశోక్ నగర్ లలో రాకపోకల కు అంతరాయం కలిగిస్తూ రోడ్డుపైన నిల్వ ఉన్న నీటినితొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు.దీనితో పాటు 48వ వార్డు జన చైతన్య నగర్ వద్ద గాడేరు కాలువ పూర్తి స్థాయిలో ప్రవహించేందుకు అడ్డంకిగా ఉన్న గుర్రపు డెక్కను పూర్తి తొలగించాలన్నారు.43వ వార్డు ట్రెజరీ కాలనీ కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగాఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం లో ఉన్న బాధితులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.వారికి అందిస్తున్న భోజన సౌకర్యం,వసతి బాగున్నదని కలెక్టర్ కి తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా బాధితులకు భోజనం ను వడ్డించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వల్పంగా ముంపుకు గురైన ప్రాంతాలలో ఉన్న నివాసాల లోని వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వర్షాల వల్ల వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలనన్నారు.
నీటి ప్రవాహం సజావుగా వెళ్లేందుకు అడ్డంకిగా ఉండి ఆక్రమించి ఇండ్ల నిర్మాణం చేసిన వారికి నోటీసులు ఇవ్వాలని సూచించారు.జిల్లా కలెక్టర్ వెంట కమిషనర్ సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

*కాకినాడ అర్బన్ పరిధి ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన.*
కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28 (పున్నమి న్యూస్): ఇటీవల కురిసిన వర్షాల వల్ల ముంపు లోనే ఉండి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్న వార్డులలో వెంటనే నీటిని తొలగించి రాకపోకలకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించారు.సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్…ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాకినాడ అర్బన్ పరిధిలో 43,48,49 వ వార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.కాకినాడ అర్బన్ పరిధిలో 49వ వార్డు మధురానగర్,అశోక్ నగర్ లలో రాకపోకల కు అంతరాయం కలిగిస్తూ రోడ్డుపైన నిల్వ ఉన్న నీటినితొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు.దీనితో పాటు 48వ వార్డు జన చైతన్య నగర్ వద్ద గాడేరు కాలువ పూర్తి స్థాయిలో ప్రవహించేందుకు అడ్డంకిగా ఉన్న గుర్రపు డెక్కను పూర్తి తొలగించాలన్నారు.43వ వార్డు ట్రెజరీ కాలనీ కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగాఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం లో ఉన్న బాధితులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.వారికి అందిస్తున్న భోజన సౌకర్యం,వసతి బాగున్నదని కలెక్టర్ కి తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా బాధితులకు భోజనం ను వడ్డించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వల్పంగా ముంపుకు గురైన ప్రాంతాలలో ఉన్న నివాసాల లోని వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వర్షాల వల్ల వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలనన్నారు. నీటి ప్రవాహం సజావుగా వెళ్లేందుకు అడ్డంకిగా ఉండి ఆక్రమించి ఇండ్ల నిర్మాణం చేసిన వారికి నోటీసులు ఇవ్వాలని సూచించారు.జిల్లా కలెక్టర్ వెంట కమిషనర్ సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

