ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 25 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు మస్తాన్‌వలి దర్గాలో ‘తాలీమ్ ఏ హునర్’ కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసిన 50 మంది మహిళలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, సీఈఓ యాకూబ్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి వక్ఫ్ బోర్డు ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. మహిళలకు కుట్టు శిక్షణతో పాటు త్వరలో కంప్యూటర్ శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యమని అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. కసుమూరు దర్గాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.

కసుమూరు దర్గాలో 50 మందిమహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 25 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు మస్తాన్‌వలి దర్గాలో ‘తాలీమ్ ఏ హునర్’ కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసిన 50 మంది మహిళలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, సీఈఓ యాకూబ్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి వక్ఫ్ బోర్డు ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. మహిళలకు కుట్టు శిక్షణతో పాటు త్వరలో కంప్యూటర్ శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యమని అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. కసుమూరు దర్గాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.

