Wednesday, 16 September 2026
  • Home  
  • కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసన..*
- ASIFABAD

కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసన..*

*కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా* కాగజ్‌నగర్: కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా పథకాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ కాగజ్‌నగర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు… *బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,* గారి ఆదేశాల మేరకు ఈ నిరసన నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిందని వారు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించడంలో నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా పథకాన్ని రద్దు చేసే దిశగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకూడదని డిమాండ్ చేశారు. “పేదల సంక్షేమ పథకాలను రాజకీయ కక్షతో నిలిపివేయకుండా, అర్హులైన ప్రతి కుటుంబానికి కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ ప్రయోజనం అందించాలి” అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తూ అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

*కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా*

కాగజ్‌నగర్: కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా పథకాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ కాగజ్‌నగర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు…

*బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,* గారి ఆదేశాల మేరకు ఈ నిరసన నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిందని వారు పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించడంలో నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా పథకాన్ని రద్దు చేసే దిశగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకూడదని డిమాండ్ చేశారు.

“పేదల సంక్షేమ పథకాలను రాజకీయ కక్షతో నిలిపివేయకుండా, అర్హులైన ప్రతి కుటుంబానికి కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ ప్రయోజనం అందించాలి” అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తూ అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.