మనుబోలు 29-05-2020(పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామం హరిజనవాడలో మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా స్థానిక వైసీపీ నాయకులు ఆవుల.మనోహర్ రెడ్డి , అడపాల.శివకుమార్ రెడ్డి తమ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్యులను కోరిన క్రమంలో శుక్రవారం నాడు వెంకన్నపాలెం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆవుల.మనోహర్ రెడ్డి , అడపాల.శివకుమార్ రెడ్డి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…డాక్టర్ సుబ్బరాజు