Saturday, 5 September 2026
  • Home  
  • కనుమరుగవుతున్న రైతు నేస్తాలు.. .. కాపాడుకుంటే ఎంతో ప్రయోజనం..
- సిద్ధిపేట

కనుమరుగవుతున్న రైతు నేస్తాలు.. .. కాపాడుకుంటే ఎంతో ప్రయోజనం..

పున్నమి..మిరుదొడ్డి. వ్యవసాయ సాగు బడిలో చీడ పీడల బెడద ఎక్కువైతే పంటలు పూర్తిగా తగ్గిపోతుంది.. పంటలను ఆశించి నష్టపరిచే పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఎడాపెడ రసాయన ఎరువులను వాడటం వల్ల రైతులకు మేలు చేసే మిత్ర పురుగులు పక్షులు , కనుమరుగైపోతున్నాయి. ఇవి పంటలకు కీడు చేసే పురుగులను తిని పంటల దిగుబడిని పెంచడంలో సహాయపడతాయి పంట పొలాల్లో ఎటువంటి మిత్ర పురుగులు పక్షులను సంరక్షిస్తేనే రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. పర్యావరణ సమతుల్యాన్ని కావడంలో సహజమైన మిత్ర పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి అందుకే అవన్నీ రైతులకు నేస్తాలు…… కానరాని పశు సంపద….. వ్యవసాయ రంగంలో యాంత్రిక విప్లవ రావడంతో కాలక్రమేన పశు సంపద కానరాకుండా పోయింది దున్నకం మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు రైతులు యంత్రాలపైనే ఆధారపడి ఉన్నారు. ఒకనాడు తొలకరి పులకరింపుతో పశువులతో నీ వ్యవసాయం ప్రారంభమయ్యేది దిగుబడి రాశులను ఎడ్డబండ్లపై ఇండ్లకు చేర్చుకునేవారు. పశువుల ఎరువులతో అధిక దిగుబడి సాధించేవారు కాలక్రమమైన యాంత్రిక వ్యవసాయానికి అలవాటుపడ్డ రైతులకు పశువుల అవసరం లేకుండా పోయింది దీంతో పశుసంపద కనుమరుగయ్యింది. మిత్ర పురుగులతోనే అధిక దిగుబడులు…. పంటలకు మేలు చేసే అక్షింతల పురుగులు( లేడి బెల్ట్ బీటి ల్ ) మిడతలు తూనీగలు సాలె పురుగులు పిచ్చుకలు కొంగలు కాకులు మైనాలు కొంగలు కోయిలలు వానపాములు కప్పలు పెంకు పురుగులు ఆరుద్ర పురుగులు రైతులకు అసలైన నేస్తాలుగా పరిగణిస్తారు. వీటిలో కొన్ని భూసారాన్ని పంపేదిస్తే మరికొన్ని పంటలకు నష్టాలను కలిగించే పురుగులను తిని పంటలను సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ రైతులు అధిక దిగుబడులను ఆశించి మోతాదుకు మించిన రసాయన ఎరువులను వినియోగించడం వల్ల మేలు చేసే మిత్ర పురుగులు అంతరించిపోతున్నాయని వ్యవసాయ అధికారులు పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అవసరం మేరకే రసాయన ఎరువులను వినియోగించి మిత్ర పురుగులను కాపాడుకుంటేనే మంచి దిగుబడులు సాధించవచ్చు అని సూచిస్తున్నారు. సూక్ష్మ జీవులను పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది… పంటలకు మేలు చేస్తున్న రైతు నేస్తాలను తప్పనిసరిగా కాపాడుకోవాలి వ్యవసాయ రంగంలో ముఖ్య భూమిక పోషించే పశు సంపద కనుమార్గవడంతో రైతులు సేంద్రియ ఎరువులకు దూరమయ్యారు. అలాగే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు అంతేకాక చీడపీడలను వదిలించుకోవడానికి రకరకాల పురుగుల మందులను వాడడంతో రైతు నేస్తాలైన సూక్ష్మజీవులు పక్షులు, పశువులు , కనుమరుగవుతున్నాయి. అనవసర పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించి పంటలకు మేలు చేసే బదనికలు పరాన్న జీవులు పక్షులను కాపాడుకోవాలి అని వ్యవసాయ అధికారులు రైతులకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

పున్నమి..మిరుదొడ్డి.

వ్యవసాయ సాగు బడిలో చీడ పీడల బెడద ఎక్కువైతే పంటలు పూర్తిగా తగ్గిపోతుంది.. పంటలను ఆశించి నష్టపరిచే పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఎడాపెడ రసాయన ఎరువులను వాడటం వల్ల రైతులకు మేలు చేసే మిత్ర పురుగులు పక్షులు , కనుమరుగైపోతున్నాయి. ఇవి పంటలకు కీడు చేసే పురుగులను తిని పంటల దిగుబడిని పెంచడంలో సహాయపడతాయి పంట పొలాల్లో ఎటువంటి మిత్ర పురుగులు పక్షులను సంరక్షిస్తేనే రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. పర్యావరణ సమతుల్యాన్ని కావడంలో సహజమైన మిత్ర పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి అందుకే అవన్నీ రైతులకు నేస్తాలు……

కానరాని పశు సంపద…..

వ్యవసాయ రంగంలో యాంత్రిక విప్లవ రావడంతో కాలక్రమేన పశు సంపద కానరాకుండా పోయింది దున్నకం మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు రైతులు యంత్రాలపైనే ఆధారపడి ఉన్నారు. ఒకనాడు తొలకరి పులకరింపుతో పశువులతో నీ వ్యవసాయం ప్రారంభమయ్యేది దిగుబడి రాశులను ఎడ్డబండ్లపై ఇండ్లకు చేర్చుకునేవారు. పశువుల ఎరువులతో అధిక దిగుబడి సాధించేవారు కాలక్రమమైన యాంత్రిక వ్యవసాయానికి అలవాటుపడ్డ రైతులకు పశువుల అవసరం లేకుండా పోయింది దీంతో పశుసంపద కనుమరుగయ్యింది.

మిత్ర పురుగులతోనే అధిక దిగుబడులు….

పంటలకు మేలు చేసే అక్షింతల పురుగులు( లేడి బెల్ట్ బీటి ల్ ) మిడతలు తూనీగలు సాలె పురుగులు పిచ్చుకలు కొంగలు కాకులు మైనాలు కొంగలు కోయిలలు వానపాములు కప్పలు పెంకు పురుగులు ఆరుద్ర పురుగులు రైతులకు అసలైన నేస్తాలుగా పరిగణిస్తారు. వీటిలో కొన్ని భూసారాన్ని పంపేదిస్తే మరికొన్ని పంటలకు నష్టాలను కలిగించే పురుగులను తిని పంటలను సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ రైతులు అధిక దిగుబడులను ఆశించి మోతాదుకు మించిన రసాయన ఎరువులను వినియోగించడం వల్ల మేలు చేసే మిత్ర పురుగులు అంతరించిపోతున్నాయని వ్యవసాయ అధికారులు పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అవసరం మేరకే రసాయన ఎరువులను వినియోగించి మిత్ర పురుగులను కాపాడుకుంటేనే మంచి దిగుబడులు సాధించవచ్చు అని సూచిస్తున్నారు.

సూక్ష్మ జీవులను పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది…

పంటలకు మేలు చేస్తున్న రైతు నేస్తాలను తప్పనిసరిగా కాపాడుకోవాలి వ్యవసాయ రంగంలో ముఖ్య భూమిక పోషించే పశు సంపద కనుమార్గవడంతో రైతులు సేంద్రియ ఎరువులకు దూరమయ్యారు. అలాగే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు అంతేకాక చీడపీడలను వదిలించుకోవడానికి రకరకాల పురుగుల మందులను వాడడంతో రైతు నేస్తాలైన సూక్ష్మజీవులు పక్షులు, పశువులు , కనుమరుగవుతున్నాయి. అనవసర పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించి పంటలకు మేలు చేసే బదనికలు పరాన్న జీవులు పక్షులను కాపాడుకోవాలి అని వ్యవసాయ అధికారులు రైతులకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.