Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కంచికచర్లలో టీడీపీ ఇన్చార్జిల ప్రమాణ స్వీకారం ఘనంగా ప్రజలతో మమేకమై పార్టీ బలపరచాలని ఎమ్మెల్యే సౌమ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కంచికచర్లలో టీడీపీ ఇన్చార్జిల ప్రమాణ స్వీకారం ఘనంగా ప్రజలతో మమేకమై పార్టీ బలపరచాలని ఎమ్మెల్యే సౌమ్య

వార్త ముఖ్యాంశాలు

  • కంచికచర్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో గురువారం మండల, గ్రామ పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, పోలింగ్ బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.
  • ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమం” అని పేర్కొన్నారు.

కంచికచర్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో గురువారం మండల, గ్రామ పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, పోలింగ్ బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమం” అని పేర్కొన్నారు. తెలుగు వారి స్వాభిమానాన్ని ఢిల్లీకి చాటి చెప్పిన మహానీయుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సేవలను ఆమె స్మరించుకున్నారు. “పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పక లభిస్తుంది. పదవి పెద్దది, చిన్నది అనేది కాదు — అది దక్కడం స్వయంగా ఒక గౌరవం,” అని ఆమె అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ బలాన్ని పెంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు, స్కీమ్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *