ఏ ఎస్ పేట నూతన ఎస్ఐ గా షేక్ జిలాని బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా తొలుత ఏఎస్పేట మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ హజరత్ కాజా నాయబ్ రసూల్ వారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా సిబ్బంది సాదరంగా ఆహ్వానించి దర్గా లోపల దొరసానమ్మ ల సమాధుల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై షేక్ జిలాని మాట్లాడుతూ సాధారణ బదిలీలలో భాగంగా ఆత్మకూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తూ ఏఎస్ పేట ఎస్సైగా నియమితులై బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. స్టేషన్ సిబ్బంది ఎస్సై షేక్ జిలాని కి స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించారు. ఏ ఎస్ పేట మండల ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కార దిశగా చర్యలు చేపడతానని తెలిపారు. అలాగే మండల పరిధిలో ఎలాంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి సరేలే చేపడతానని అన్నారు. ఏఎస్ పేట ఎస్ఐగా ఇప్పటివరకు విధులు నిర్వహిస్తున్న సైదులు నెల్లూరు ట్రాఫిక్ కు బదిలీ అయ్యారు.

ఏఎస్ పేట ఎస్సైగా షేక్ జిలాని బాధ్యతలు స్వీకరణ.. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు