భూపాలపల్లి జూలై 13 పున్నమి న్యూస్ : మోరంచపల్లి గ్రామంలో నూతన రేషన్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే *గండ్ర సత్యనారాయణ రావు* గారు ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ షాప్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి లబ్ధిదారులను మోసం చేసిందని, నాణ్యతలేని దొడ్డు బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేసిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం అందేలా పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు.ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో గారు, స్థానిక సర్పంచ్, రేషన్ షాప్ నిర్వాహకులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



