భూపాలపల్లి, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి)
ఎస్ ఆర్ డిజి స్కూల్ భూపాలపల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం కృష్ణ చైతన్య మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ జెండాకు వందనం చేశారు.
అనంతరం ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం గురించి ప్రేరణాత్మకంగా వివరించారు. స్వాతంత్ర్య సమర సమయంలో ప్రజలు ఐకమత్యంతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.
అప్పటి ప్రజల్లో ఉన్న ఐక్యత, దేశభక్తి, దేశభక్తితో కూడిన పాటలు, త్యాగస్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.
Uploaded Video:




