ఖమ్మం: కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ నెల 28న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయడంతో పాటు ఆయనను బాధ్యతల నుంచి తొలగించాలని నూతి సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని కోరారు.



